హాప్పీ బర్త్‌డే శ్రీలీల.. ఈ బ్యూటీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం!

by Jakkula Samataha |   ( Updated:2024-06-14 05:51:45.0  )
హాప్పీ బర్త్‌డే శ్రీలీల.. ఈ బ్యూటీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం!
X

దిశ, సినిమా : పెళ్లి సందD సినిమాతో తెలుగు చిత్రప పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయమే కాకుండా డ్యాన్స్‌తో తన సత్తా చాటుతుంటుంది. మొదటి మూవీ ఫ్లాప్ అయినా ఈ ముద్దుగుమ్మకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. చాలా తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ అందుకొని, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతుంది.

కాగా, నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు ఈరోజు. జూన్ 14,2001లో ఈ నటి అమెరికాలో పుట్టింది. ఇక కర్ణాటకలోని బెంగుళూరులో పెరిగారు. కన్నడ సినిమా కిస్ తో ఈ బ్యూటీ వెండితెరకు పరిచయం అయ్యింది. తెలుగులో పెళ్లి సందడి సినిమాతో అరగేట్రం చేసి, తన నటనతో ఆకట్టుకుంది. దీంతో రవితేజా హీరోగా తెరకెక్కిన ధమాకా మూవీలో ఈ బ్యూటీ నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ వెనక్కు తిరిగి చూసుకోకుండా వరసగా ఆఫర్స్ వచ్చాయి. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం వంటి సినిమాల్లో నటించింది. కానీ పాపం ఈ మూవీస్‌లో కొన్ని హిట్ టాక్ తెచ్చుకోగా, కొన్ని సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ నుంచి ఎలాంటి ఆఫర్స్ రావడం లేదని సమాచారం. ప్రస్తుతం ఈ నటి రవితేజతో ఓ సినిమాకు కమిట్ అవ్వగా, విజయ్ దేవరకొండ సరసన కూడా నటిస్తోంది. ఇంకో రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇంకా చిత్ర పరిశ్రమలో ఎలాంటి ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్ ఫుల్‌గా తన జర్నీ కొనసాగించాలని, తన అభిమానులు కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed