హ్యాపీ బర్త్ డే వరుణ్ సందేశ్.. ఈయన గురించి ఈ విషయాలు తెలుసా?

by Jakkula Samataha |
హ్యాపీ బర్త్ డే వరుణ్ సందేశ్.. ఈయన గురించి ఈ విషయాలు తెలుసా?
X

దిశ, సినిమా: హ్యాపీ డేస్ సినిమా ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న హీరో వరుణ్ సందేశ్. కొత్త బంగారు లోకం, హ్యాప్పీడేస్ వంటి చిత్రాల ద్వారా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈయన వితిక‌ను వివాహంచేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత కొన్ని రోజులపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. తర్వాత తెలుగు బిగ్ బాస్ హౌజ్‌లో14 వ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టాడు.అంతే కాకుండా ఈయనతో పాటు తన భార్య కూడా బిగ్ బాస్ హౌస్‌‌లోకి వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. వరుణ్ సందేశ్ ఇన్ని రోజుల తర్వత బిగ్ బాస్‌లో కనిపించాడేంటి అని. ఇక తన సినిమాలతో ఎంతో మందిని అలరించిన ఈ హీరో పుట్టిన రోజు ఈరోజు. ఈయన ఒడిషాలోని రాయగడలో జన్మించాడు. దీంతో వరుణ్ సదేశ్‌కు తన అభిమానులందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed