- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today Nithya Menon Birthday: ఈ భామని చూస్తే ఎవరికైనా గుండె జారి గల్లంతవ్వాల్సిందే..!
దిశ, వెబ్ డెస్క్: ఉంగరాల జుట్టు, పెద్ద పెద్ద కళ్ళతో చూడగానే ఆకట్టుకునే రూపం హీరోయిన్ ‘నిత్యా మీనన్’ సొంతం. జూనియర్ సౌందర్య అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తూ ఉంటారు ఈ భామని. నిత్యా ఫెర్మామెన్స్ చూసిన ఏ ప్రేక్షకుడికైనా ‘గుండెజారి గల్లంతవ్వాల్సిందే. నిత్యా కోసమే ‘ఓ చిన్నదాన నీ కోసం’ అంటూ థియేటర్లకు వెళ్ళినవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఇలా ఎన్నో సినిమాల్లో తన సోలో ఫెర్మామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బర్త్ డే ఇవాళ (ఏప్రిల్ 8). నిత్యా మీనన్ 1988 ఏప్రిల్ 8న బెంగళూరులో కర్ణాటకలో స్థిరపడిన మలయాళీ తల్లిదండ్రులకు జన్మించింది. అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఇక యాక్టింగ్ మీద ఉన్న ఇష్టంతో 1998లో హనుమాన్ అనే ఫ్రెంచ్-ఇండియన్ ఆంగ్ల చిత్రంలో టబుకు చెల్లెలుగా నటించింది. అనంతరం 2006లో 7 ఓ క్లాక్ అనే కన్నడ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసింది. ఇక 2008లో ఆకాశ గోపురం సినిమాతో మళయాలంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ద్వారా నిత్యా చాలా ప్రశంసలు అందుకుంది.
ఇవి కూడా చదవండి: Today Allu Arjun Birthday: బన్ని అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ..!
టాలీవుడ్ ఎంట్రీ
2011లో నందిని రెడ్డి డైరెక్షన్ లో నానీ హీరోగా వచ్చిన ‘అలా మొదలైంది’ సినిమాతో నిత్యామీనన్ తెలుగు సినిమా కెరీర్ మొదలైంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అటు నానీకి .. ఇటు నిత్యాకు పుష్కలంగా అవకాశాలు లభించాయి. ఇక ఈ సినిమా ద్వారా నిత్యా మీనన్ నంది అవార్డు కూడా అందుకుంది. ఇక 2013-15 సమయంలో జబర్తస్త్, గుండె జారి గల్లంతయ్యిందే అనే సినిమాల్లో నటించింది. నితిన్ హీరోగా వచ్చిన గుండె జారి గల్లంతయ్యిందే చిత్రంలో ఆమె రెండు షేడ్స్ ఉన్న పాత్రలను పోషించింది.
అలాగే తన సహనటి ఇషా తల్వార్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది. అనంతరం శర్వానంద్ తో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, S/O సత్యమూర్తి, గీత గోవిందంలో సపోర్టింగ్ రోల్ చేసింది. రుద్రమదేవి సినిమాలో కూడా నిత్యా సపోర్టింగ్ పాత్ర పోషించింది. అలాగే 2022లో వచ్చిన భీమ్లా నాయక్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్ నటించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం నిత్యా మీనన్ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కలిపి చాలా సినిమాల్లో నటిస్తోంది.