- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్‌బాస్‌కి వెళ్ళడానికి శ్రీముఖి దగ్గర అప్పు తీసుకున్న..10 లక్షలు ఫైన్ కట్టి మరీ..అవినాష్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: జబర్దస్త్ షోతో ఎంతోమంది కమెడియన్స్ పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో అవినాష్ ఒకరు. జబర్దస్త్ లో కంటెస్టెంట్‌గా చేరి ముక్కు అవినాష్‌గా గుర్తింపు తెచ్చుకొని టీమ్ లీడర్ అయ్యాడు. ప్రస్తుతం అవినాష్ సినిమాల్లో కమెడియన్‌గా వరుసగా ఛాన్సులు తెచ్చుకుంటున్నాడు. అయితే జబర్దస్త్ నుంచి అవినాష్ బిగ్ బాస్ కి వెళ్ళిన విషయం తెలిసిందే. జబర్దస్త్‌లో.. ఆ షో నిర్మాణ సంస్థలో చేసేవారికి అక్కడ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్‌తో పాటు ఇన్నాళ్లు చేయాలని బాండ్ కూడా ఉంటుంది. ఆ బాండ్ మధ్యలో బ్రేక్ చేసి వెళితే ఆ నిర్మాణ సంస్థకి భారీగా ఫైన్ కట్టాల్సిందే. అయితే అవినాష్ జబర్దస్త్ చేస్తున్నప్పుడే బిగ్ బాస్ అవకాశం రావడంతో ఆ బాండ్ బ్రేక్ చేసి బిగ్ బాస్‌కి వెళ్ళాడు.
ఇందుకు జబర్దస్త్ నిర్మాణ సంస్థకు అవినాష్ 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో కి వెళ్లే సమయంలో నా దగ్గర అంత డబ్బు లేకపోవడంతో యాంకర్ శ్రీముఖి దగ్గర 5 లక్షలు, మరొకరి దగ్గర 5 లక్షలు తీసుకుని ఆ ఫైన్ కట్టాను. అప్పుగా తీసుకున్నా ఆ 10లక్షలు కూడా బిగ్‌బాస్ నుంచి తిరిగిరాగానే ఇచ్చేసా.. బిగ్ బాస్ వల్ల నాకు ఫైనాన్షియల్‌గా బాగానే డబ్బులు వచ్చాయని.. ఆ తర్వాత టీవీ సినిమాల్లో కూడా మంచి ఛాన్సులు వచ్చాయని తెలిపాడు అవినాష్. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.