- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూఎస్ ప్రీ సేల్స్‌లో దుమ్మురేపుతోన్న టిల్లు స్క్వేర్.. $150K మార్క్ రీచ్
దిశ, సినిమా: లవ్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ‘డీజే టిల్లు’ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అక్క రాధికక్క అంటూ సిద్ధు జొన్నలగడ్డ చేసిన ఫన్ జనాలు ఇప్పటికి మర్చిపోలేదు. డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దర్శకుడు మల్లిక్ రామ్ దీనికి సీక్వెల్ గా ‘టిల్లు స్వ్కేర్’ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు.
చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. ఈ మూవీ రేపు(మార్చి 29) విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మేకర్స్, ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేందుకు నిన్న ఓ ట్రైలర్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ USA ప్రీమియర్స్ ప్రీ- సేల్స్ $150K కి చేరుకున్నట్లు తెలుస్తుంది. మూవీ టీమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.