- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health:కుర్చీలో ఎక్కువ సేపు కూర్చుంటే.. తర్వాత జరిగేది ఇదే..
దిశ, ఫీచర్స్: జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఇప్పటి యువత వారానికి 60 గంటలకు పైగా కూర్చొని పనిచేస్తున్నారట. అంటే సగటున రోజుకు 10 గంటలపాటు కూర్చొని జాబ్ చేయడమో లేదా సోషల్ మీడియాలో ముగినిపోవడం వంటివి చేస్తుంటారు. ఇలా ఎక్కువ సమయం కూర్చొని ఉండటం వల్ల త్వరగా గుండె సంబంధిత జబ్బులతో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ సేపు కదలకుండా కూర్చొని జాబ్ చేసేవారి జీవక్రియలో మార్పులు సంభవిస్తాయని పరిశోధనల్లో తేలింది.
‘కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయం’, ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్‌సైడ్’లోని శాస్త్రవేత్తలు 730 మంది కవలలతో సహా 1,000 మందిపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో ఎక్కువ సమయం కూర్చొని పనిచేసేవారు, తక్కువ సమయం కూర్చొని పనిచేసేవారికి వేరు వేరు ఆరోగ్య ఫలితాలు వచ్చాయట.
రోజులో 10 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చొని పనిచేసేవారు.. ప్రతిరోజు 30నిమిషాలు వ్యాయామం చేసినా, వారి జీవక్రియ వేగంగా జరుగుతుందని తెలిపారు. దీంతో వారికి త్వరగా వృద్ధాప్య లక్షణాలు కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు తెలియజేశారు. ఇక, రోజులో 6గంటలు కూర్చొని పనిచేసేవారు ప్రతిరోజు 30నిమిషాల కంటే ఎక్కువ సమయం వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.
అందుకే ఇప్పటి యూత్ యుక్తవయస్సులో వృద్ధులుగా కనిపించే ప్రమాదాన్ని తగ్గించడానికి రోజంతా తక్కువ కూర్చోవడం, ఎక్కువసేపు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా రోజువారి ఆహారంలో భాగంగా పండ్లు, కూరగాయలు, తృణాధాన్యాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల తక్కువ వయస్సులో వృద్దాప్యం వచ్చే చాన్స్ ఉండదని తెలిపారు.