- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుల గణన తోనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి : మంత్రి దామోదర రాజనర్సింహ
దిశ,సంగారెడ్డి : సమగ్ర కుటుంబ సర్వేతో బడుగు బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయపరంగా అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, అటవీ, పర్యావరణ, దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖ లు అన్నారు. బుధవారం సమగ్ర కుటుంబ సర్వే ను సంగారెడ్డి పట్టణం విద్యానగర్ కాలనీలోని 31వ వార్డులో లో మంత్రి కొండా సురేఖ తో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహాలు ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చాక దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
భారత్ జూడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన కార్యక్రమం చేపట్టిందన్నారు. నెల రోజుల లోపే ఈ సర్వే పూర్తికానున్నట్లు తెలిపారు. 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవాలన్నారు. 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ను నియమించి కుల గణన కార్యక్రమం చేపట్టినట్లు సంగారెడ్డి జిల్లాలో సుమారు నాలుగు లక్షల పైచిలుకు కుటుంబాలు కు సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సర్వేలో 55 అంశాలకు సంబంధించి 75 ప్రశ్నల ను వివిధ కోట రూపంలో ఎన్యుమరేటర్లు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
ఈ సర్వే ద్వారా కులగనలతో పాటు ఆయా కుటుంబాల సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు సేకరించనున్నట్లు తెలిపారు. ఈ సర్వేలో కులాలవారీగా, మతాలవారీగా, కుటుంబాల ఆర్థిక, రాజకీయ, సామాజిక, స్థితిగతులను ప్రభుత్వం తెలుసుకుని వారి అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమాచారమంతా గోప్యంగా ఉంటుందన్నారు. సామాజిక లెక్క సరిగా ఉంటే మన హక్కులను మనమే పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి , అదనపు కలెక్టర్ లు చంద్రశేఖర్ ,మాధురి , సంబంధిత జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.