ఆ ముగ్గురు హీరోలకు లిప్ లాక్ ఇస్తా: రష్మిక సంచలన కామెంట్స్!

by Anjali |   ( Updated:2023-08-10 12:57:21.0  )
ఆ ముగ్గురు హీరోలకు లిప్ లాక్ ఇస్తా: రష్మిక సంచలన కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బడా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. రణ్‌బీర్ సరసన ‘యానిమల్’ చిత్రంలో.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జంటగా ‘పుష్ప-2’ లో నటిస్తోంది. వీటితో పాటుగా కన్నడలో మరో సినిమాకు ఒప్పుకుందని సమాచారం. తాజాగా ఈ హీరోయిన్ తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. కాగా ఓ నెటిజన్ ఈ భామను క్రేజీ క్వశ్చన్స్‌తో ఆడుకున్నారు.

విజయ్ దేవరకొండతో మీ సినిమా ఎప్పుడు ఉంటుందని అడగ్గా.. దానికి రష్మిక..‘ఈ ప్రశ్న మీరు విజయ్‌నే అడగాలి. కానీ మంచి కంటెంట్ ఉన్న స్టోరీతో ఎవరైనా డైరెక్టర్ వస్తే మేం మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని’ బదులిచ్చింది. మరో నెటిజన్.. ‘విజయ్ దళపతి, షారుఖ్, విజయ్‌ దేవరకొండ‌లలో మీరు ఎవరికి లిప్ లాక్ ఇస్తారని అడగ్గా.. ‘కాస్త ఆలోచించి ఆ ముగ్గురికి ఇస్తానని చెప్పింది. దీంతో తన ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ‘అవును నీకు ఎంత మంది అయినా ఓకేనా’ అంటూ కొంతమంది జనాలు వల్గర్ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్ చల్ సృష్టిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed