ఆ తప్పులే.. పూజా హెగ్డేను ఇండస్ట్రీకి దూరం చేస్తున్నాయా..!

by Kavitha |   ( Updated:2024-01-09 08:01:15.0  )
ఆ తప్పులే.. పూజా హెగ్డేను ఇండస్ట్రీకి దూరం చేస్తున్నాయా..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే సడన్ గా ఇప్పుడు ఫ్రీ బర్డ్ హీరోయిన్ గా మారిపోయింది.. అవకాశాలు లేక వచ్చిన అవకాశానాల వదులుకొని కెరీయర్ ని చేతులారా చెడగొట్టుకుంటోంది. ఆమె ప్లేస్ లో చాలా సినిమాల్లో ఇతర హీరోయిన్ లు నటిస్తూ దూసుకుపోతున్నారు. ‘గుంటూరు కారం’ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె పేరు ఎక్కడ వినిపించలేదు. అయితే నాని సినిమాలో పూజా కి హీరోయిన్ గా అవకాశం వచ్చినప్పటికీ అది కూడా ఈ అమ్మడు వదులుకుంది.

ప్రజంట్ పూజా హెగ్డే చేతిలో ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా లేదు.. దీంతో తన నెక్స్ట్ సినిమా అప్ డేట్ కోసం అభిమానులు మాత్రం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే పూజ హెగ్డే కి తెలుగు ప్రేక్షకులు బోర్ కొట్టారు అని, అందుకే తను ఇలా టాలీవుడ్ లో ఆఫర్ లు వచ్చిన.. వదులుకుంటుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతే కాదు తెలుగులో పాన్ ఇండియా వైడ్ గా చిన్న హీరోయిన్లు సైతం, భారీ హిట్లు సంపాదిస్తున్నా ఈ సమయంలో.. పూజా హెగ్డే ఇలా వచ్చిన అవకాశాలను, వదులుకోవడం చూస్తూ ఉంటే నెమ్మదిగా ఈ అమ్మడు టాలీవుడ్ కి దూరం అయ్యేలా కనిపిస్తుంది.

Advertisement

Next Story