- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
saripodhaa sanivaaram: ఈ మంత్ ఎండ్ అదిరిపోతుంది: హీరో నాని
దిశ, సినిమా: నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. 'సుదర్శన్ థియేటర్ నాకు చాలా ప్రత్యేకం. ఈ మంత్ ఎండ్‌కి అదిరిపోతుంది. మీ అందరితో కలిసి సినిమా ఇక్కడే చూస్తాను. మీ ప్రేమ కోసం నేను ఇలాగే కష్టపడి మీకు మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పాలంటే.. 'నాకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చిందటే వీళ్ళు నా మనుషులు, వాళ్ళ సమస్య నా సమస్య.
వాళ్ళ సంతోషం నా సంతోషం'. అందుకే ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఆగస్ట్ 29న సరిపోదా శనివారం థియేటర్స్‌లో ఈ విజయాన్ని పంచుకుందాం' అన్నారు. నటుడు ఎస్.జె.సూర్య మాట్లాడుతూ 'ట్రైలర్‌ను మించి సినిమా ఉంటుంది. నాని ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఆయన మంచి మనిషి. ఆయన మంచి మనసుకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. నాని ఈ సినిమాలో శనివారం బాషా. డి.వి.వి దానయ్య ఈ చిత్రం కోసం ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. సోకులపాలెం అనే ఒక ఏరియాని ఫుల్‌సెట్ వేశారు. కంటెంట్ వున్న ఎనర్జీఫుల్ సినిమా ఇది. తప్పకుండా చిత్రం హిట్ అవుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.