ఇది ఆషాఢ మాసం.. ముహూర్తం పెట్టకూడదంటున్న రాజమౌళి

by Prasanna |
ఇది ఆషాఢ మాసం.. ముహూర్తం పెట్టకూడదంటున్న రాజమౌళి
X

దిశ, సినిమా: ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొంత సమయం విరామం తీసుకున్నారు జక్కన్న. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. అతి భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీయనున్నారని సినీ వర్గాల చెబుతున్నారు.

ఈ మూవీ కోసం మహేష్ బాబు ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. ప్రస్తుతం, మహేష్ లుక్ మొత్తం మారిపోయింది. హాలీవుడ్ సినిమాలలో హీరోలు లాంగ్ హెయిర్ ఎలా పెంచుకుంటారో మహేష్ హెయిర్ కూడా అలాగే ఉంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న

ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది. అయితే, ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. రాజమౌళి కూడా పూజలు ఎక్కువ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం, ఆషాడ మాసం కొనసాగుతోంది. జూన్ 23 నుంచి జూలై 21 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో ఎవరూ శుభకార్యాల చేయరు.. అలాగే కొత్త పనులు కూడా ప్రారంభించడానికి ఎవరూ ఇష్టపడారు. రాజమౌళి వీటిని పాటిస్తున్నారని తెలుస్తుంది. అందువల్ల ఈ సమయంలో మంచి ముహూర్తం ఉండదని, తన కొత్త మూవీని మొదలు పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు.

Advertisement

Next Story