- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్టార్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం..
దిశ,వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి నక్కిన సూర్యారావు గారు కన్నుమూశారు. గత కొంతకాలంగా వయసు పైబడి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నేడు వారి స్వగ్రామం అనకాపల్లిలో ఆయన అంత్యక్రియలు చేయబోతున్నట్లు సమాచారం. దీంతో ఆయన కుటుంబం దు:ఖంలో మునిగిపోయింది. దీంతో సినీ ప్రముఖులు,నటీ నటులు సోషల్ మీడియాలో వేదికగా త్రినాధరావు కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. పలువురు స్వయంగా ఇంటికి వెళ్లిన త్రినాధరావు తండ్రి భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు.
త్రినాధరావు నక్కిన 2013లో ‘ప్రియతమా నీవు అచట కుశలమా’ అనే సినిమాతో డైరెక్టర్‌గా సినీ రంగా ప్రవేశం చేశారు. అలా పలు చిత్రాలు చేసిన ఆయన రాజ్ తరుణ్ 'సినిమా చూపిస్తా మామ' సినిమాతో తొలి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత నాని-కీర్తి సురేష్ నేను లోకల్ మూవీతో సూపర్ హిట్ కొట్టారు. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన రామ్ పోతినేని హలో గురు ప్రేమ కోసమే సినిమా తీశారు. ఇక త్రినాధరావు నక్కిన చివరిగా ధమాకా సినిమా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన మెగా హీరో వరుణ్ తేజ్‌తో మట్కా మూవీ చేస్తున్నారు.