Anushka సినిమాలకు దూరంగా ఉన్నది అందుకేనా?

by Seetharam |   ( Updated:2022-11-05 02:46:16.0  )
Anushka  సినిమాలకు దూరంగా ఉన్నది అందుకేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: అతి తక్కువ కాలంలోనే కేవలం తెలుగులోనే కాకుండా సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో అనుష్క ఒకరు. హీరోలతో సమానంగా ఫ్యాన్స్‌ ఉన్నా.. ప్రస్తుతం సినిమాకు దూరంగా ఉంటున్నారు. అనుష్క సినిమాలు తెరపై చూడక దాదాపు మూడున్నరేళ్లకు పైగానే అయింది. దీంతో చాలామంది అనుష్క ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారనే చెప్పారు. అయితే ఆమె మూవీలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో అని చాలామంది గుసగుసలాడుకుంటున్నారు.

ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని, లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేయడంతో హీరోయిన్ పాత్రలకు ఆమెను తీసుకునేందుకు డైరెక్టర్లు, నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అవకాశాలు లేకనే అనుష్క సైలెంట్‌గా ఉన్నారని సమాచారం. దాంతోపాటు ఆమె బాడీలో పలు మార్పులు కూడా ఒక కారణమని, అతి త్వరలో పెళ్లి చేసుకోబోతోందని అందువల్లనే అంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed