పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరోయిన్.. వెడ్డింగ్ కార్డ్‌తో ఆహ్వానిస్తూ షాకిచ్చిన భామ (వీడియో)

by Hamsa |   ( Updated:2023-06-16 14:47:08.0  )
పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరోయిన్.. వెడ్డింగ్ కార్డ్‌తో ఆహ్వానిస్తూ షాకిచ్చిన భామ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నిత్యం పలు విషయాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది. వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ఎమర్జెన్సీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. తాజాగా, కంగనాకు పెళ్లికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో కారులో కంగనా వస్తుంది. అప్పుడు మీడియా ప్రతినిధులంతా కారును చుట్టుముట్టి పెళ్లి గురించి అడుగుతారు. దీంతో వెంటనే కంగనా వెడ్డింగ్ కార్డ్ చూపిస్తూ అందరినీ పెళ్ళికి ఆహ్వానిస్తుంది. ఈ వీడియోనే చూసిన నెటిజన్లు ఈ భామ పెళ్లి చేసుకోబోతుంది అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇదంతా కంగనా నిర్మిస్తున్న చిత్రం ‘టిక్కు అండ్ షేరు’ మూవీ ప్రమోషన్స్‌లో భాంగంగానే అలా చేసినట్లు తెలుస్తోంది.

Also Read: ‘విరాట‌ప‌ర్వం’ దర్శకుడితో ధ‌నుష్ మూవీ?

Advertisement

Next Story

Most Viewed