సావిత్రి ‘మిస్సమ్మ’ సినిమాకు వాడాల్సిన టైటిల్ .. లావణ్య త్రిపాఠి కొట్టేసింది..

by Kavitha |
సావిత్రి ‘మిస్సమ్మ’ సినిమాకు వాడాల్సిన టైటిల్ .. లావణ్య త్రిపాఠి కొట్టేసింది..
X

దిశ, సినిమా: మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. తను చేసే ప్రతి సినిమాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలా గుర్తింపు పొందిన వాటిలో ‘మిస్సమ్మ’ మూవీ ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, జమున లాంటి స్టార్స్‌తో నటించిన సావిత్రి ఆ టైటిల్‌కి పాత్రకి తగ్గట్టు న్యాయం చేసి లైఫ్ లాంగ్ గుర్తిండిపోయేలా చేసింది. ఇక నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాణంలో LV ప్రసాద్ ఈ మూవీని తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ‘మిస్సమ్మ’ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ‘మిస్సమ్మ’ కాదంటూ డైరెక్టర్ హను రాఘవపూడి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ హను రాఘవపూడి మిస్సమ్మ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘అందాల రాక్షసి’ సినిమాలో లావణ్య పాత్రని గీతాంజలి సినిమా నుంచి ప్రేరణగా తీసుకుని రాసానని అంటున్నారు. కానీ అది అబద్ధం. ఎందుకంటే నేను ఆ పాత్రని మిస్సమ్మ సినిమాలో సావిత్రి గారి పాత్ర నుంచి తీసుకొని రాసుకున్నాను. ఆ పాత్రలో ఉండే అమాయకత్వం, కోపం ఇక్కడ లావణ్య పాత్రలో కూడా ఉంటాయి. టైటిల్ కూడా అక్కడనుంచే తీసుకున్నాను. మిస్సమ్మ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ అందాల రాక్షసి. ఆ టైటిల్ నేను పెట్టుకున్నాను అని తెలిపారు.

కాగా ‘అందాల రాక్షసి’ మూవీతోనే డైరెక్టర్ హను రాఘవపూడి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.


Advertisement

Next Story

Most Viewed