సుధీర్ బాబు మూవీకి టైటిల్ ఫిక్స్

by Shiva |   ( Updated:2023-06-20 04:51:45.0  )
సుధీర్ బాబు మూవీకి టైటిల్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్ : దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకరతో టాలీవుడ్ స్టార్ సుధీర్ బాబు తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఫాదర్స్ డే సందర్భంగా, చిత్ర నిర్మాతలు ఈ చిత్రం టైటిల్‌ను వెల్లడించారు. ఈ చిత్రానికి 'మా నాన్న సూపర్ హీరో' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. టైటిల్‌ను ప్రకటిస్తూ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఎమోషనల్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో మూవీ మేకర్స్ ప్రకటించనున్నారు. జయ్ క్రిష్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి వీ సెల్యులాయిడ్ నిర్మిస్తోంది.

Also Read: ప్రభాస్ 'సలార్' టీజర్‌పై తాజా అప్‌డేట్..

Advertisement

Next Story