రష్మిక - విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలపై స్పందించిన టీమ్

by Anjali |
రష్మిక - విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలపై స్పందించిన టీమ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి. వీరి ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు సైతం అంగీకరించారంటూ, ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్ జరగబోతుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లపై విజయ్ దేవరకొండ టీమ్ స్పందించి.. రష్మిక-విజయ్ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లను నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు.

ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ.. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించడంతో వీరి జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే వీరిద్దరు పలు ఈవెంట్లకు కలిసి అటెండ్ అవ్వడం తో ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. తాము కేవలం మంచి ఫ్రెండ్సే అంటూ ఈ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టిపరేశారు. ప్రస్తుతం పెళ్లి వార్తలపై కూడా విజయ్ టీమ్ సోషల్ మీడియాలోని నెటిజన్లకు స్పష్టత ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed