ఒక్క ప్లాప్‌తో సినిమాలకు గుడ్ బై.. కట్ చేస్తే బిలీనియర్.. ఈమె ఎవరంటే?

by Jakkula Samataha |
ఒక్క ప్లాప్‌తో సినిమాలకు గుడ్ బై.. కట్ చేస్తే బిలీనియర్.. ఈమె ఎవరంటే?
X

దిశ, సినిమా : అందాల రాణి ఆదితి ఆర్యన్ మిస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్‌లో తన నటన, అందంతో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకొని, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.అయితే తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే? ఈ నటి హీరోయిన్‌గా కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే కొనసాగి, తర్వాత సినీ ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పింది. తర్వాత బిలీనియర్ అయిపోయింది.

అదేలా అంటే..ఆదితి ఇజం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఇక బాలీవుడ్‌లో ఈ బ్యూటీ 83 మూవీ బయోగ్రాఫికల్‌ స్పోర్ట్స్‌ డ్రామా. దీపికా పదుకొనే నిర్మించింది. ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే, పంకజ్ త్రిపాఠి, తాహిర్ రాజ్ భాసిన్, జీవా, సాకిబ్ సలీమ్, జతిన్ సర్నా, చిరాగ్ పాటిల్, దినకర్ శర్మ, నిషాంత్ దహియా, హార్డీ సంధు, సాహిల్ ఖట్టర్, అమ్మీ విర్క్, ఆదినాథ్ కొఠారే, ధైర్య కర్వా నటించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలడంతో ఈ నటి సినిమాలు వదిలేసింది. తర్వాత భారతదేశంలోని రిచెస్ట్‌ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్‌ను పెళ్లి చేసుకుంది. ఫోర్బ్స్ ప్రకారం.. ఉదయ్ కోటక్ నెట్‌ వర్త్‌ $13.4 బిలియన్ల(రూ.1340 కోట్లు) వరకు ఉంది.ఆయన భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరు. అలా ఈ బ్యూటీ బిలీనియర్ అయిపోయింది.

Advertisement

Next Story