ఆ డైరెక్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్?

by Jakkula Samataha |   ( Updated:2024-01-25 15:12:37.0  )
ఆ డైరెక్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్?
X

దిశ, సినిమా : చిత్ర పరిశ్రమలో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం ఎంత తొందర జరుగుతుందో విడిపోవడం కూడా అంతే తొందర జరుగుతుంది. ఇక పెళ్లి చేసుకొని అధికారికంగా విడిపోకున్నా.. కొన్ని జంటలు మాత్రం సంతోషంగా లేరంట. అంతేకాదండోయ్ ఓ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఇప్పుడు చాలా బాధపడుతుందంట. కెరీర్ పీక్స్‌లో ఉండగా దర్శకుడిని ప్రేమ పెళ్లి చేసుకొవడంతో తన సినీ కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేయాల్సి వచ్చిందంట.

ఇంతకీ ఆ కపుల్ ఎవరు అనుకుంటున్నారా? డైరెక్టర్ సూర్య కిరణ్ , నటికళ్యాణి.రాజశేఖర్ శేషు సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమై, తర్వాత ర‌వితేజ‌కు జోడీగా ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో నటించి హిట్ అందుకుంది ఈ భామ.ఆ తర్వాత దొంగోడు, కబడ్డీ కబడ్డీ, లాంటి చాలా సినిమాల్లోనే చేసి మంచిఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే కళ్యాణి కెరీర్ ప‌రంగా పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే దర్శకుడు సూర్యకిరణ్‌తో ప్రేమలో పడి, సినిమాలకు దూరమైంది. తర్వాత వీరు వీరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన విడిపోయారు. ఒక వేళ నటి సూర్యకిరణ్‌ను పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే ఇప్పుడు తన క్రేజ్ మరోలా ఉండేదంటున్నారు తన ఫ్యాన్స్.

Read More..

Trisha Krishnan : మత్తెకించే ఫోజులతో మరోసారి ఆకట్టుకుంటున్న త్రిష..

Advertisement

Next Story