- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర వ్యాప్తంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమా షోలు రద్దు
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమా షోలు రద్దు చేశారు. చెన్నై, కోయంబత్తూర్, మధురై, సేలంతో పాటు ముఖ్య నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో షోలు రద్దు అయ్యాయి. సినిమాను బ్యాన్ చేయాలని రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతుండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లను ముట్టడిస్తామని తమిళనాడులోని పలు పార్టీలు, ముస్లిం సంఘాలు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ముందస్తు హెచ్చరికలతో వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యాలు అన్ని షోలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా, ఈ సినిమా మొదటినుంచి వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. అయినా మొదటిరోజు భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అయిన హీరోయిన్ అదా శర్మ కీలక పాత్రలో నటించింది. గతకొంతకాలంగా వరుస ఫ్లాపులతో బాధపడుతున్న ఆమెకు ‘ది కేరళ స్టోరీ’ రూపంలో భారీ విజయమే దక్కింది. గత కొంత కాలంగా కేరళలో అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు బహిరంగంగ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కథనే సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు సుదీప్తో సేన్. దీంతో సినిమా విడుదలకు ముందే వివాదాస్పదం అయింది.
ఇవి కూడా చదవండి: