- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'కల్కి' నుంచి సెకండ్ ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎలా ఉందంటే?
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ’కల్కీ 2898AD’. ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవిపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా కల్కి నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ పేరుతో మేకర్స్ విడుదల చేసిన ఆడియో ఆకట్టుకుంటుంది. విజువల్స్, అదిరిపోయాయని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌తో పాటు కొత్త వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ ట్రైలర్‌లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాలోని చాలా పాత్రలను చూపించాడు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘అశ్వత్థామ’గా డేరింగ్ స్టంట్స్ చేస్తూ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నారని ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. అలాగే కమల్ హాసన్ ‘యాస్కిన్’గా గుర్తించలేని డెడ్లీ అవతార్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ‘బుజ్జి’తో కలిసి ప్రభాస్ ‘భైరవ’గా బౌంటీ హంట్‌లో అదరగొట్టారు. దీపిక పదుకొనె అయితే ప్రెగ్రెంట్ ఉమెన్‌గా, దిశా పటానీ రాక్సీగా పవర్ ఫుల్ ప్రజెన్స్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. కాగా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలలో విడుదల కానుంది.