బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కోట్ల విలువైన గిఫ్ట్.. ఎవరిస్తున్నారో తెలుసా?

by Anjali |   ( Updated:2024-02-01 09:09:25.0  )
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కోట్ల విలువైన గిఫ్ట్.. ఎవరిస్తున్నారో తెలుసా?
X

దిశ, సినిమా: హనుమాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌‌ను తన ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజా సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది. బాక్సాఫీసును ఓ ఊపు ఊపిందనడంలో అతిశయోక్తి లేదు. సంక్రాంతి బరిలో దిగిన సీనియర్ స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇచ్చాడు. ఈ దెబ్బకు ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు. హనుమాన్ సినిమా సక్సెస్ కావడంతో.. ప్రశాంత్ వర్మ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నాడు.

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పార్ట్-2 లో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబులను ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో థియేటర్ మరోసారి బద్దలవ్వాల్సిందే అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. మరో ఇంటర్వ్యూలో 1000 కోట్ల బడ్జెట్ ఆఫర్ వచ్చిందంటూ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీంతో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళినే దాటేశాడుగా అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.

ఇకపోతే హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన నిరంజన్ రెడ్డి.. దర్శకుడు ప్రశాంత్ వర్మకు రూ. 6 కోట్ల విలువైన లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నారట. ఇప్పటికే కారు బుకింగ్ కూడా అయిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్త ఎంత వరకు వాస్తవమో తెలియదు కానీ నెట్టింట జోరుగా ప్రచారం చేస్తున్నారు.



Advertisement

Next Story