- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kamal Haasan: ఏం చెయ్యబోతున్నావు మణిరత్నం.. సస్పెన్స్‌ను పెంచేస్తున్న కమల్ హాసన్ మూవీ!
దిశ, సినిమా: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇటీవల ‘ఇండియన్ 2’ తో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘KH234’గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘థగ్ లైఫ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. కమల్‌హాసన్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న ఇందులో ఐశ్వర్యలక్ష్మి, త్రిష హీరోయిన్స్ కాగా.. శింబు, జోజు జార్జ్, గౌతమ్ కార్తీక్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ క్రమంలోనే ఈ మూవీలోకి మరో ఇద్దరు యాక్టర్లను ఆహ్వానిస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మణిరత్నం టీమ్. ఈ మేరకు ‘నాజర్, అభిరామిని ‘థగ్ లైఫ్’ లోకి స్వాగతిస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంటే.. ఇంత మంది స్టార్స్‌తో మణిరత్నం ఏం చెయ్యబోతున్నాడు.. వీరిని ఎలా చూపించబోతున్నాడు అనేది ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది.