సౌత్ ఇండస్ట్రీపై ఐశ్వర్యా రాయ్ కామెంట్స్ వైరల్

by Hamsa |   ( Updated:2023-04-29 09:25:05.0  )
సౌత్ ఇండస్ట్రీపై ఐశ్వర్యా రాయ్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: అందాల తార ఐశ్వర్యా రాయ్ భాషతో సంబంధం లేకుండా తన అందం, నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అయితే రీసెంట్‌గా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐశ్వర్య .. డ్యూయల్ రోల్‌తో ఆకట్టుకుంది. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐష్.. దక్షిణాది, ఉత్తరాది సినిమా ఇండస్ట్రీ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ‘ప్రతి మూవీ భార‌తీయ సినిమానే. నేనెప్పుడూ సౌత్ అండ్ నార్త్ అని విడిగా చూడలేదు. ఒక దగ్గర అవకాశాలు రాకపోతే, మరొక చోట ప్రయత్నిస్తారు. కళకు, కళాకారులకు ఎక్కడైనా ఒకే రకమైన గౌరవం ఉంటుంది. ఒక దానితో మరొకటి ఓవర్ టేక్ చేస్తుందంటే ఒప్పుకోను’ అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

Next Story