హీరో శింబు పెళ్లి వార్తలపై ఆయన మేనేజర్ ఏమన్నారంటే..!

by Hamsa |
హీరో శింబు పెళ్లి వార్తలపై ఆయన మేనేజర్ ఏమన్నారంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో శింబు పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శింబు ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నాడని శ్రీలంకకు చెందిన ఓ బడా బిజినెస్ మ్యాన్ కూతురిని వివాహామాడనున్నట్లు కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. తాజాగా, శింబు పెళ్లి వార్తలపై ఆయన మేనేజర్ స్పందించారు. ‘‘ శ్రీలంకకు చెందిన తమిళ అమ్మాయిని శింబు పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలన్నింటిని మేము ఖండిస్తున్నాము.

ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. పెళ్లి వంటి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అంశాలపై వార్తలను రాసేటప్పుడు ఒకసారి మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. అటువంటి శుభవార్త ఏమైనా ఉంటే ముందుగా మీడియాకే తెలియజేస్తాం’’ అని శింబు మేనేజర్ చెప్పుకొచ్చారు. అప్పట్లో శింబు, నయనతార, హన్సికలతో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. శింబు సినిమాల విషయానికొస్తే మన్మథ, వల్లభ , లైఫ్ ఆఫ్ మత్తు, వంటి చిత్రాలతో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘పాతు తలా’ అనే సినిమాతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ మార్చి 30న విడుదల కానుంది.

Advertisement

Next Story

Most Viewed