గొడ్డు మాంసం అమ్ముతూ అడ్డంగా బుక్కైన బాలయ్య బ్యూటీ.. నెటిజన్లు షాక్

by samatah |   ( Updated:2023-07-15 15:46:43.0  )
గొడ్డు మాంసం అమ్ముతూ అడ్డంగా బుక్కైన బాలయ్య బ్యూటీ.. నెటిజన్లు షాక్
X

దిశ, సినిమా: బాలయ్య బ్యూటీ హనీరోజ్ భయంకరమైన లుక్‌లో దర్శనమిచ్చి అభిమానులకు ఆశ్చర్యపరిచింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘రాచెల్’ త్వరలో రిలీజ్ కానుండగా.. మూవీనుంచి ఆమె ఫస్ట్ లుక్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు హనీ కత్తి పట్టుకుని మాంసం కొడుతుండగా తన చుట్టూ దున్నపోతు తలకాయలు కనిపిస్తున్నాయి. అంతేకాదు దీనినిబట్టి ఆమె బీఫ్ అమ్మే దుకాణదారు పాత్ర చేస్తుందని తెలుస్తుండగా సీరియస్ లుక్‌ మాత్రం విలన్ క్యారెక్టర్‌ను తలపిస్తోంది. ఇక ఈ లుక్‌ను నెట్టింట షేర్ చేసిన నటి.. ‘అబ్రిడ్ షైన్ అందించిన నా రాబోయే చిత్రం ‘రాచెల్’ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆనందిని బాల దర్శకత్వం వహించిన తొలి చిత్రం. బాదుషా, షినోయ్ మాథ్యూ, అబ్రిడ్ షైన్‌లు నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాం’ అంటూ వివరించింది.


Advertisement

Next Story