- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరంజీవిని రిజెక్ట్ చేసిన హీరోయిన్.. రొమాన్స్ నచ్చడం లేదంటూ వెళ్లిపోయిన నటి!
దిశ, వెబ్‌డెస్క్: అప్పటికి, ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ కూడా అస్సలు వదులుకోదు. అలాంటిది హీరోయిన్ నగ్మా చిరు సినిమాలో నటించడానికి ఇష్టపడలేదట. తెలుగు, కన్నడ, మలయాళ, భోజ్‌పూరి, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ 50 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి కాకపోవడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే గతంలో ఈ హీరోయిన్, మెగాస్టార్‌తో ‘ఘరానా మొగుడు’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ షూటింగ్‌లో నగ్మా, చిరుతో కలిసి ఓ రొమాంటిక్ సీన్‌లో నటిస్తోన్న సమయంలో ఎందుకో ఆమెకు రొమాన్స్ ఇబ్బందిగా అనిపించిందట. ఆ షూటింగ్ అయిపోయాక ‘మీతో రొమాన్స్ నాకు నచ్చడం లేదంటూ ఫేస్‌పైనే చెప్పిందట నగ్మా. ఇక అప్పటి నుంచి మెగాస్టార్ దగ్గరకు దర్శక, నిర్మాతలు ఏదైనా మూవీ కోసం వస్తే నా చిత్రంలో నగ్మాను మాత్రం తీసుకోకండి అని చెప్పేవారట. ఈ విషయాన్ని ఈమండి రామారావు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.