గ్రాండ్‌గా లాంచ్ అయిన వి.యఫ్.సి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం

by sudharani |   ( Updated:2023-03-22 15:36:31.0  )
గ్రాండ్‌గా లాంచ్ అయిన వి.యఫ్.సి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం
X

దిశ, సినిమా: నిజ జీవిత సంఘటన ఆధారంగా వి.యఫ్.సి క్రియేషన్స్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1గా ఓ సినిమా రాబోతుంది. హరి మేఘామ్స్, రవితేజ, హనీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమాకు కొప్పుల చిన్నయ్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ తునికి హరికృష్ణ నిర్మిస్తున్నారు. అయితే పూజా కార్యక్రమాలతో బుధవారం వైభవంగా ప్రారంభమైన సినిమా హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రఘుబాబు క్లాప్ కొట్టారు.

శ్రీ రంగం శ్రీనివాసులు కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. టి.యన్.జి.ఓ ప్రెసిడెంట్ ప్రభాకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగబాల సురేష్ కుమార్, శ్రీ రంగం శ్రీనివాసు, వైబవ్ తదితర అతిథులు.. 20 ఏళ్ల క్రితం తెలంగాణలో జరిగిన లవ్ అండ్ క్రైమ్ స్టోరీని ఇతివృత్తంగా చేసుకుని రూపొందిస్తున్న సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

ఘనంగా ప్రారంభమైన చిలక ప్రొడక్షన్స్ నంబర్ 2 సినిమా

Advertisement

Next Story