- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గే’ లాగా నటించమని ప్రభాస్‌ని ఫోర్స్ చేసిన డైరెక్టర్.. కష్టమైన తప్పలేదంటున్న హీరో
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. రీసెంట్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈయన.. ప్రజెంట్ ‘కల్కి 2898, స్పిరిట్, రాజా సాబ్’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే.. ప్రభాస్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మొదట రెండు సినిమాలు పర్వలేదు అనిపించుకున్నాయి. తర్వాత వచ్చిన ‘వర్షం’ మూవీతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయి.. ఈరోజు పాన్ ఇండియా లెవల్‌లో సినిమాలు చేస్తున్నాడు. కానీ, ఒకానొకా మూవీలో ప్రభాస్ గే లాగా చేశాడు. దానికి గురించి ఇటీవల చెప్పుకొచ్చాడు.
అదే ‘చక్రం’ మూవీ. కృష్ణ వంశీ దర్శకత్వంలో ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం.. అప్పట్లో ఆడియన్స్‌ని అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇందులో ప్రభాస్ చాలా డిఫరెంట్‌గా కనిపించడమే కాకుండా ఓ సీన్‌లో గే లాగా కూడా యాక్ట్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ చక్రం మూవీ గురించి హాట్ కామెంట్స్ చేశారు. మీ కెరీర్‌లో కష్టంగా అనిపించిన సీన్ ఏంటి ప్రశ్నకు ప్రభాస్ బదులిస్తూ.. ‘చక్రం చిత్రంలో ఓ సీన్‌లో గే లాగా నటించాల్సి వచ్చింది. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. కానీ డైరెక్టర్ చేయమని చెప్పడంతో తప్పలేదు. క్యారెక్టర్‌కి అవసరం కాబట్టి ఏదో చేయాలని చేశాను తప్ప నాకు ఏమాత్రం ఇష్టం లేదు. చాలా ఇబ్బందిగా చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.