Allu Arjun, Ram Charan :రామ్ చరణ్- అల్లు అర్జున్ మధ్య విబేధాలు..! ఆ పోస్ట్‌తో క్లారిటీ

by Hamsa |   ( Updated:2023-06-15 09:36:00.0  )
Allu Arjun, Ram Charan :రామ్ చరణ్- అల్లు అర్జున్ మధ్య విబేధాలు..! ఆ పోస్ట్‌తో క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: మెగా- అల్లు కుటుంబాల మధ్య కొద్ది కాలంగా విభేదాలు వచ్చాయని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే చరణ్’కు గ్లోబల్ ఇమేజ్ వచ్చిందని బన్నీకి అసూయ ఎక్కువయి మెగాస్టార్ ఇంటికి వెళ్లడం కూడా మానేశారని తెలుస్తోంది. ఆ పుకార్లపై అటు అల్లు అరవింద్, చిరంజీవి ఎన్నో సార్లు తమ కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. అయితే విభుదాల రూమర్స్‌కు చెక్ పెడుతూ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి ఓ ఫొటోను షేర్ చేసింది. జూన్ 14న రామ్ చరణ్-ఉపాసన 11 వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అల్లు స్నేహారెడ్డి ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది. వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్‌లో అల్లు అర్జున్ దంపతులతో, చరణ్ కపుల్ దిగిన ఫొటోను షేర్ చేస్తూ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చింది. అందులో చరణ్, అల్లు అర్జున్ కుపుల్స్ నవ్వుతూ కనిపించారు. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read: జిమ్‌లో సెగలు పుట్టిస్తున్న ఈషా రెబ్బా అందాలు..

Sai Dharam Tej: టాలీవుడ్ హీరోయిన్ ప్రేమలో మరో మెగా హీరో.. త్వరలో పెళ్లి ఫిక్సేనా?

Advertisement

Next Story

Most Viewed