ఆమె నుండి నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అదే : అనుపమ

by Kavitha |   ( Updated:2024-03-30 07:14:03.0  )
ఆమె నుండి నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అదే : అనుపమ
X

దిశ, సినిమా: కుర్రకారులో స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఎంతో పద్ధతైన పాత్రలే పోషించి ఎలాంటి ఎక్స్‌పోజ్ చేయని అనుపమ ఒక సారిగా ‘టిల్లు స్క్వేర్’ లో బోల్డ్‌గా కనిపించి ప్రేక్షకులకు అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ మూవీలో సిద్దూ జొన్నలగడ్డ తో రెచ్చిపోయి లిప్ లాక్ సీన్లలో నటించడంతో చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. చాలా రోజుల పాటు ఎదురు చూసేలా చేసినా.. టిల్లు మరోసారి తన నటనతో పంచ్ డైలాగులతో అభిమానులు ఫిదా చేశాడు. ఈ సినిమా మొత్తం తన భుజాలపై మోశాడని ప్రశంసలు అందుకుంటున్నాడు.ఇక అనుపమ కూడా తనలోని కొత్త నటనను కనబరిచింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ ఈ సినిమాతో తనకు బ్యాడ్ మాత్రమే కాదు మంచి కాంప్లిమెంట్ కూడా దక్కినట్లు ఆమె చెప్పింది.. ‘ ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో నటించిన రాధిక నాకు స్వయంగా ఫోన్ చేసి నా నటనను మెచ్చుకుంది. నాకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే’ అని అనుపమ చెప్పింది. ఇవన్నీ చూసుకుంటే అనుపమ చేసిన ఈ కొత్త ప్రయత్నం తనకు ఒకింత తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.

Read More..

‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజు ఎన్ని కోట్లో తెలుసా..?

Advertisement

Next Story