- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ షోలో పవన్ కళ్యాణ్ పై సంచలన ప్రశ్న అడిగిన యాంకర్.. వీడియో వైరల్
దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది నటీనటులు ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. అతను ఈ షోకు రాకముందు మ్యాజిక్ చేస్తూ ఉండేవాడు. తర్వాత ఈ షోకి వచ్చి స్టార్ హీరో క్రేజ్ తెచ్చు్కున్నాడు అని చెప్పడంలో అతియోశక్తి లేదు. యాంకర్ రష్మీతో ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ నడిపి ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యాడు. తర్వాత సినిమాల్లో నటించే ఛాన్స్ రాగానే బుల్లితెరకి బై బై చెప్పేశాడు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు చేసినప్పటికి అనుకున్నంత క్రేజ్ అయితే దక్కలేదు. ఇక జబర్దస్త్ నుంచి ఎప్పుడైతే తను అవుట్ అయిపోయాడో అప్పటి నుంచి తన అభిమానులు తనని మళ్లీ బుల్లితెరలో చూడాలని చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. ఇక అలాంటి సందర్భంలోనే ‘సర్కార్ సీజన్ 4’ తో సుధీర్ మళ్లీ మెరిశాడు. కాగా ఈ షో తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా సర్కార్ షో ఎపిసోడ్ 11 ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ లో అనసూయ, మనో, బాబా భాస్కర్, గీతా మాధురి లాంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. అయితే ఈ ప్రోమో చివర్లో సుడిగాలి సుధీర్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్‌ను అడిగినట్టుగా తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆయన్ని ‘అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము’ అంటూ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరు అని అడగబోతున్నట్టుగా తెలుస్తుంది ఆ ప్రోమోలో. నిజానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన కామెంట్లు చేశారు. ఇక అధికారంలో ఉన్న మంత్రులు వరుస పెట్టి మరి పవన్ కళ్యాణ్ ని కామెంట్లు చేయడమే పనిగా పెట్టుకున్నారు.
ఇక అందులో ముఖ్యంగా మంత్రి రోజా అయితే పవన్ కళ్యాణ్ ని నానా రకాలుగా తిట్టారు. ఇక ఆమె ముందుగా పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అంటూ కొన్ని వాక్యాలైతే చేశారు. అలా పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు తాకనివ్వము అని అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఇప్పుడు అసెంబ్లీలో లేరు వాళ్ళందరూ ఓడిపోయి తీవ్రమైన బాధలో ఉన్నారు. ఇక మొత్తానికైతే ఈ షో ద్వారా మరోసారి పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి తెలిపే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా ఈ షో ఫుల్ ఎపిసోడ్ ఈ శుక్రవారం (జూన్ 28) రిలీజ్ కానుంది.