- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీలీలను ఆ టాలీవుడ్ డైరెక్టర్ అన్ని విధాలుగా వాడుకున్నాడు.. రాఘవేంద్ర రావు ఆసక్తికర కామెంట్స్!
దిశ, వెబ్‌డెస్క్: బాలయ్య, శ్రీలీల, కాజల్ కీలక పాత్రల్లో నటించి చిత్రం ‘భగవంత్ కేసరి’. దీనిని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దసరా బరిలో నిలిచిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా, చిత్ర యూనిట్ ‘భగవంత్ కేసరి’ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా డైరెక్టర్ రాఘవేంద్ర రావు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ బాలయ్య బాబు ఈ చిత్రంలో తండ్రిగా నటించి ఎన్టీఆర్‌ని గుర్తు చేశాడు.
తండ్రి పేరు ఎప్పుడో నిలబెట్టాడు. ఆంధ్రప్రదేశ్ అంతగా జై బాలయ్య నినాదాలు వినిపిస్తున్నాయి’’ అని అన్నారు. అనంతరం శ్రీ లీల గురించి మాట్లాడుతూ.. ‘‘ శ్రీలీల గురించి ఏం చెప్పాలి. ఆమె ఏదైనా అవలీలగా చేసేస్తోంది. నటన అలాగే చేసింది. డాన్స్, ఫైట్స్, ఎమోషన్స్ అన్ని అవలీలగా చేసింది. నేను శ్రీలీల మీద జామ నండు మాత్రమే వాడాను. అంటే గ్లామర్ రోల్లో అల్లరిగా చూపించాను. అనిల్ రావిపూడి మాత్రం శ్రీలీలను అన్ని విధాలుగా వాడుకుని అనేక కోణాల్లో చూపించాడు. అందుకు శ్రీ లీల అనిల్ రావిపూడికి రుణపడి ఉండాలి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాఘవేంద్ర రావు కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీలీల ప్రస్తుతం వరుస చిత్రాల్లో ఛాన్సులు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది.