తరుణ్ సినిమాలు అందుకే చేయడం లేదు.. విక్రమ్ కామెంట్స్ వైరల్!

by Jakkula Samataha |
తరుణ్ సినిమాలు అందుకే చేయడం లేదు.. విక్రమ్ కామెంట్స్ వైరల్!
X

దిశ, సినిమా : హాస్యనటుడు ఎంఎస్ నారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. తనను చూడగానే నవ్వు వస్తుంది. అంతలా తాను తన కామెడీతో అందరిని మాయ చేసి కడుబ్బా నవ్వించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కుమారుడు ఆసక్తికర విషయాలు తెలియజేశాడు.ఎంఎస్ నారాయణ కొడుకు విక్రమ్, కొడుకు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన ఎలాంటి సినిమా తీయలేదు. యాంకర్ మీరు సినిమాలు ఎందుకు ఆపేశారు, తీయోచ్చుగా అని అడగ్గా, దాని గురించి ఆయన మాట్లాడుతూ.. మాకు అంతగా పొటన్షియల్ లేదు. మాకు అంతగా డబ్బు లేదు, మా నాన్నకు కళ అంటే ఇష్టం అంతే, డబ్బు ఉంటే చేసేవాడిని, అయినా చిత్ర పరిశ్రమలో నిలబడాలంటే, అదృష్టం కూడా ఉండాలి. లక్ లేకపోతే కిందికే వెళ్లిపోతాము, హీరో తరుణ్ మంచి ట్యాలెంట్ ఉన్న వ్యక్తి. నేషనల్ అవార్డు విన్నర్ ఆయన ఇప్పుడు సినిమాలకు చాలా దూరంగా ఉంటున్నాడంటే, ట్యాలెంట్ లేక కాదు? లక్ ఉండాలి.అంతే కాకుండా వరుణ్ సందేశ్ కూడా మంచి సినిమాలు చేశారు కానీ వీరందరూ సినిమాలకు దూరం అయ్యారు. వీరికి ట్యాలెంట్ లేక కాదు, కలిసి రాకపోవడం వల్లనే. పొటన్షియల్ సపోర్ట్, లక్ ఉంటేనే చిత్రపరిశ్రమలో ఎదుగ గలుగుతాం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story