- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్కార్‌పై తెలుగు చలనచిత్ర మండలి
దిశ, సినిమా : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు గర్వ కారణమైన రోజు 12 మార్చి 2023. ఈ రోజున జరిగిన 95వ ఆస్కార్ పురస్కార వేడుకల్లో తెలుగు సినిమా ‘RRR’ లో ‘నాటు – నాటు’ పాటకు ఆస్కార్ పురస్కారం ( బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ) రావడం తెలుగు సినిమా పరిశ్రమే కాకుండా భారతదేశ సినీ పరిశ్రమకు గర్వకారణం. ఈ సందర్బంగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి.. ‘RRR’ సినిమా నిర్మాత D.V.V దానయ్య, దర్శకులు S.S రాజమౌళి, అద్భుతమైన సంగీతం అందించిన M.M కీరవాణి, ఇంత అద్భుతమైన పాట రాసిన చంద్ర బోస్, గాత్రం అందించిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్.. ఆ పాటకి అద్భుతమైన డాన్స్ చేసిన ఇద్దరు హీరోలు నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్), కొణిదెల రామ్ చరణ్, కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్‌కు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపింది. భవిష్యత్తులో మన తెలుగు సినిమా పరిశ్రమకు ఇటువంటి ఆస్కార్ అవార్డులు మరిన్ని రావాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అకాంక్షిస్తుందని చెప్పింది.