- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘రుద్రంగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అతిథులుగా హరీష్ రావు, బాలకృష్ణ

X
దిశ, సినిమా: జగపతిబాబు నటించిన రిసెంట్ మూవీ ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో జగపతిబాబు ఒకప్పటి తెలంగాణ దొర పాత్రలో నెగెటివ్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. ఇందులో సీనియర్ హీరోయిన్లు విమలారామన్‌తో పాటు, లాంగ్ గ్యాప్ తర్వాత మమతా మోహన్‌దాస్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. జూలై 7న విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 29న హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ ఈవెంట్‌కు బాలకృష్ణతో పాటు, తెలంగాణ మంత్రి హరీష్‌రావు గెస్ట్‌లుగా హాజరుకానున్నారు. వీరితోపాటు పలువురు తెలంగాణ రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
Read More: మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కంగన.. ఆ స్టోరీకి తను మాత్రమే న్యాయం చేయగలదట
Next Story