- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తరుణ్ బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించబోతున్నాడు.. తల్లి రోజా రమణి ఆసక్తికర కామెంట్స్!
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో తరుణ్ ఒకప్పుడు పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొద్ది కాలంగా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉండటం లేదు. మొత్తానికి కనిపించకుండా పోయాడు. కానీ తరుణ్ పెళ్లి వార్తలు ఎన్నో వచ్చాయి. అయినప్పటికీ ఆయన మాత్రం స్పందించి క్లారిటీ ఇవ్వలేదు. తరుణ్ తల్లి రోజా రమణి క్లారిటీ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, తరుణ్ తల్లి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసింది. అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ ఉందంటూ ప్రకటించింది. ‘‘త్వరలోనే తరుణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి సంబంధించిన ఆలోచనలు జరుగుతున్నాయి. ఎలాంటి కథలు చేయాలనేది అతనే నిర్ణయించుకుంటున్నాడు.
కచ్చితంగా తొందరలో బిగ్ సర్ప్రైజ్ ప్రకటించబోతున్నాడు’’ అని చెప్పుకొచ్చింది. ఇక యాంకర్ మరీ తరుణ్ సినిమాలకు దూరమైనప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? అని ప్రశ్నించగా.. దానికి రోజా రమణి స్పందిస్తూ.. ‘‘మాకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్‌తో పాటు బిజినెస్‌లు ఉన్నాయి కాబట్టి ఇన్నాళ్లు వాటిని తరుణ్ చూసుకుంటూ లాభాలు తెస్తున్నాడు. కానీ ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం మాత్రం కన్మమ్. అయితే ఏది పడితే అది చేస్తే అంత ఫేమ్ రాదు కాబట్టి రీ ఎంట్రీ విషయంలో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు’’ అని చెప్పుకొచ్చింది. దీంతో తరుణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.