- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉచిత ఆరోగ్య సేవలు అందితేనే ప్రయోజనం : ఎమ్మెల్యే పాయల్ శంకర్
దిశ,ఆదిలాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న,ఏదైనా అనుకోని ప్రమాదంలో గాయపడిన,ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్య సేవలందినప్పుడే మేలు జరుగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై 52 మంది బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు అందకపోవడంతో బాదితులు కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని అన్నారు.
దీంతో వైద్యం కోసం లక్షల్లో ఖర్చవుతుందని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తులు పెట్టుకుంటే 20 నుంచి 30 వేలు ఇస్తున్నారని తెలిపారు. వైద్య సేవలపై శాసనసభలో ప్రస్తావనకు తెచ్చిన నిధులు పెంచ లేదని ఆరోపించారు. పేదలు సంపాదించుకునే ఆదాయంలో సగానికి పైగా వైద్యం కోసమే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వైద్యం కోసం ఆస్పత్రిలో చేరిన వారికి పూర్తి సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జోగు రవి, సంతోష్,సుభాష్,అశోక్ రెడ్డి, తదితరులున్నారు.