Viswambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ లో విలన్ గా తమిళ స్టార్ హీరో.. !

by Kavitha |   ( Updated:2024-01-30 07:56:46.0  )
Viswambhara :  మెగాస్టార్ ‘విశ్వంభర’ లో విలన్ గా తమిళ స్టార్ హీరో.. !
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి లాస్ట్ ఇయర్ కం బ్యాక్ ఇచ్చి ‘వాల్తేరు వీరయ్య’ మూవీ తో మంచి హిట్ అందుకున్నాడు. ఇక అదే స్పీడ్ తో ‘భోళా శంకర్’ కూడా తీసినప్పటికీ బోల్తా పడింది. అంచానాలను తలకిందలు చేస్తూ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాదు చిరు కెరీర్‌లోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. దీంతో తన తదుపరి చిత్రాలపై జాగ్రత్తగా ఫోకస్ పెడుతున్నారు చిరు. ఈ క్రమంలో వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఇందులో చిరు సరసన త్రిష తో సహా మరో ఇద్దరు భామలు నటిస్తున్నారు.

ఇక ఈ మూవీ పై రోజురోజుకు భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఈ సినిమాను అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుంది, దానితో పాటుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుంది’ వశిష్ట చెప్పుకొచ్చాడు. ఇక ఇంకో క్రెజి న్యూస్ ఎంటీ అంటే తమిళ హీరో శింబు ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. ఈ పాత్రను దర్శకుడు వశిష్ట చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి.

Advertisement

Next Story