Dhanush: సినిమాల విషయంలో తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం!

by Hamsa |
Dhanush: సినిమాల విషయంలో తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం!
X

దిశ, సినిమా: తమిళ చిత్ర నిర్మాతల మండలి చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై చర్చించడానికి సోమవారం సమావేశమైంది. ఈ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కొందరు నటీనటులు, సాంకేతిక నిపుణులు చిత్ర నిర్మాణ సంస్థల నుంచి, నిర్మాతల నుంచి అడ్వాన్స్‌లు తీసుకుని, ఆ సినిమాలకు డేట్స్‌ ఇవ్వకుండా.. ఆ తదుపరి ఒప్పుకున్న సినిమాలను చేస్తుండటంపై ఓ డిసిషన్‌ తీసుకుంది.

ఇక నుంచి మొదట ఎవరి దగ్గర అడ్వాన్స్‌ తీసుకున్నారో వారి సినిమా పూర్తి చేసిన తర్వాత మరొక చిత్రం చిత్రీకరణలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. నటుడు ధనుష్‌ విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆయన పలు చిత్ర నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్‌లు తీసుకుని సినిమాలు చేయడం లేదని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హీరో ధనుష్‌తో సినిమా చేయాలంటే నిర్మాతల మండలి అనుమతి తీసుకోవాలని కండిషన్‌ పెట్టింది. మొదటగా అడ్వాన్స్‌లు తీసుకున్న సినిమాలు పూర్తి చేయాలని ధనుష్‌ను నిర్మాతల మండలి ఆదేశించింది.

Advertisement

Next Story