- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రామ్ చరణ్‌ను వీడని తమిళ్ మీడియా.. పబ్బం గడుపుకునేందుకే ఈ ప్రయత్నాలు అంటున్న ఫ్యాన్స్..!
దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్‌పై ఈ మధ్య కాలంలో తమిళ్ మీడియా బాగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. చర్రికీ సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ప్రధానంగా వారు కవరేజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ ‘లియో’ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడంటూ వార్తలు రాసుకొచ్చాయి. అయితే.. అందులో ఏ మాత్రం నిజం లేదని మెగా కాంపౌండ్‌కు చెందిన వారు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకున్నారు.
ఇక ముచ్చట నడుస్తుండగానే.. చర్రిపై అక్కడ మరో వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ మూవీ తర్వాత ఇండియన్-3 సినిమాను రామ్ చరణ్‌తో చేసుందుకు శంకర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తమిళ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు అలాంటి చర్చలు ఏమీ జరగలేదని మెగా కాంపౌండ్ నుంచి క్లారిటీ వస్తుంది. అయినప్పటికీ తమిళ్ మీడియా పదేపదే రామ్ చరణ్‌కి సంబంధించిన పుకార్లను పుట్టిస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుందని నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి.