కల్పిక చెప్పిందే నిజమైంది.. బయట పడిన ధన్య, తమిళ దర్శకుడి పెళ్లి గుట్టు..

by Hajipasha |   ( Updated:2022-12-29 12:33:31.0  )
కల్పిక చెప్పిందే నిజమైంది.. బయట పడిన ధన్య, తమిళ దర్శకుడి పెళ్లి గుట్టు..
X

దిశ, సినిమా: తెలుగు సినిమాల్లో సహనటిగా అనేక పాత్రలు పోషించిన కల్పిక ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో కెక్కిన విషయం తెలిసిందే. ఆమె కొంతమంది నటీనటుల గురించిన సంచలన విషయాలను లీక్ చేసింది. ముఖ్యంగా ప్రముఖ నటి ధన్య బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆమె రహస్యంగా ఓ తమిళ దర్శకుడు బాలాజీ మోహన్‌ని పెళ్లి చేసుకుందని, ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదని స్పష్టం చేసింది. రీసెంట్‌గా ఈ విషయం‌పై స్పందించారు తమిళ దర్శకుడు బాలాజీ మోహన్. వారి రహస్య వివాహం గురించి అధికారికంగా బయట పెట్టాడు. కల్పిక మాటలపై బాలాజీ కోర్టును ఆశ్రయించారు. 'నటి కల్పిక గణేష్ నా పెళ్లి‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినా పరువు తీసింది' అంటూ బాలాజీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో పాటు 'ధన్య బాలకృష్ణ, నేను గత జనవరి 23న పెళ్లి చేసుకున్నాం. కానీ కల్పికా గణేష్ మాపై దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. దీంతో నా పరువు పోయింది' అని బాలాజీ పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీంతో ప్రస్తుతం ఈ విషయం‌పై ఎలాంటి ప్రకటనా చేయవద్దని కోర్టు కల్పికను ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed