చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి

by Jakkula Samataha |
చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి
X

దిశ, సినిమా : తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ హాస్యనటుడు శేషు(60) గుండెపోటుతో కన్నుమూశారు. అయితే గత 10 రోజుల క్రితం హార్ట్ ఎటాక్‌తో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ,మంగళవారం మరణించారు. ఈయన లొల్లు సభ షో ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. శేషు ఇలామై, వేలాయుధం, A1, పారిస్ జయరాజ్, డిక్కీలోనా, గుల్ గుల్, బిల్డప్ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈయన మొత్తం ఇరవై ఐదు చిత్రాలకు పైగా నటించారు, చివరగా,సంతానం హీరోగా వచ్చిన వడకుపట్టి రామస్వామి సినిమాలో నటించారు. ఇక శేషు భౌతికకాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఈయనకు ముగ్గురు కుమారులు ఉన్నట్లు సమాచారం. శేషు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed