- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు సినిమాపై తాప్సీ కామెంట్స్.. మూవీ హిట్ అయితే హీరోకు జేజేలు.. లేదంటే హీరోయిన్లు బలి
దిశ, సినిమా : సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ పన్నూ తను నటించిన తెలుగు సినిమా ఫ్లాఫ్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో బిజీగా గడుపుతున్న నటి.. టాలీవుడ్ చిత్రాల పరాజయం కారణంగా తాను ఎదుర్కొన్న నెగెటివ్ కామెంట్స్‌ను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది. ‘నేను నటించిన తెలుగు సినిమాలు వరుసగా ఫ్లాప్ పాలయ్యాయి. దీంతో ఊహించని రేంజ్లో విమర్శలొచ్చాయి. దురదృష్టవంతురాలిని అన్నారు. నిజానికి నాకు సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి ఎలా ముందుకెళ్లాలో కొత్తలో తెలియలేదు. దీంతో చాలా తప్పులు చేశా. ఆ పొరపాట్లనుంచే పాఠాలు నేర్చుకుంటున్నా. అయినా ఒక సినిమా హిట్ కాకపోతే హీరోయిన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు? కొన్ని సన్నివేశాలు, పాటల్లో చూపించి ఫెయిల్యూర్ మొత్తం మామీదే వేస్తే ఎలా? ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు విమర్శలను పట్టించుకోకుండా.. కెరీర్లో బెస్ట్‌గా ఉండేందుకు ట్రై చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.
Also Read: త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న నాని హీరోయిన్!