- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమ జంటలపై సామాజిక ఒత్తిడి.. ఇండియాలో ఎక్కువేనంటున్న స్వర
దిశ, సినిమా: సామాజిక ఒత్తిడితోనే ఇండియాలో ప్రేమ పుడుతుందని స్వర భాస్కర్ చెబుతోంది. ఇటీవల ఫహద్ అహ్మద్‌ను వివాహం చేసుకున్న ఆమె తమ మతాలు వేరైనా రిలేషన్‌షిప్ మాత్రం బలమైనదంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘మా సంబంధం చాలా కొత్తది కాబట్టి నేను సలహా ఇవ్వదలచుకోలేదు. కానీ, వేర్వేరు ప్రపంచాల నుంచి వచ్చిన మేము అన్నింటినీ అంగీకరించడం వల్ల కలిసి ఉండగలుగుతున్నాం. భారతదేశంలోని యువ జంటలు కులం, తరగతి, మతంతో పోరాడాలి. నిజంగా మీరు ఒకరినొకరు ప్రేమిస్తే నిర్భయంగా పోరాడండి. అయితే విభిన్న నేపథ్యాలు, జీవిత అనుభవాలను కలిగి ఉన్న భిన్నమైన వ్యక్తులమని గుర్తించాలి. ప్రాథమికంగా మీరు ఎవరో దాన్ని మార్చుకోవద్దు. అయితే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం సరైనదే. అలాగైతేనే మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు’ అంటూ పలు సూచనలు చేసింది.
ఇవి కూడా చదవండి: సుశాంత్ చనిపోగానే రియా వేశ్యగా మారిందా? ప్రియాంక సంచలన ఆరోపణలు