- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vishwak Sen : గుండె మీద చేయి వేసుకుని సినిమాకి రండి: 'బుట్ట బొమ్మ పై విశ్వక్ సేన్
దిశ, సినిమా: అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'బుట్ట బొమ్మ'. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన సినిమాతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నాడు. ఫిబ్రవరి 4న విడుదల కాబోతున్న మూవీ ట్రైలర్‌ను విశ్వక్ సేన్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు మేకర్స్.
ఈ సందర్భంగా మాట్లాడిన విశ్వక్.. 'అరకులోని అందమైన లొకేషన్లను చూపిస్తూ మొదలైన ట్రైలర్ ఆహ్లాదకరంగా ఉంది. నాకు చాలా ఇష్టమైన కథ. నేను నటించాల్సి ఉన్నప్పటికీ డేట్స్ కుదరక వదిలేశా. గుండెల మీద చేతులేసుకుని సినిమాను చూడొచ్చు. అంత హాయిగా ఉంటుంది' అన్నాడు. అలాగే ఈ పల్లెటూరి కథలో సస్పెన్స్‌లు, ట్విస్ట్‌లు అలరిస్తాయన్న దర్శక నిర్మాతలు.. ట్రైలర్ లాంచ్ కోసం ముంబై నుంచి వచ్చిన విశ్వక్‌కి ప్రత్యేక థాంక్స్ చెబుతూ, మూవీ అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
READ MORE
- Tags
- vishwak sen