- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
help : ఎంబీబీఎస్ సీటు… సాయం కోసం ఎదురుచూస్తున్న చదువుల తల్లి
దిశ,తుంగతుర్తి: అసలే పేదరికం..!ఆపై మూడేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు మరణం...!!వృద్ధులైన తాత నానమ్మలు చేరదీసినప్పటికీ తొలగని ఆర్థిక ఇబ్బందులు. వెక్కిరించిన సమాజాన్ని ధీటుగా ఎదుర్కొంటూ మొక్కవోని దీక్షతో చదువుల్లోకి అడుగు పెట్టింది. డాక్టర్ కావాలనే ఒకే ఒక లక్ష్యంతో ముందుకు సాగింది..!!దీనికోసం కూలి పనులకు వెళ్ళింది. చదువుల కోసం నిద్రలేమి రాత్రులను గడిపింది.చివరికి తన లక్ష్యానికి చేరుకున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు సమస్యగా మారాయి. దాతలు కరుణిస్తేనే పేదరాలైన శిగ గౌతమి డాక్టర్ కోర్సులో అడుగు పెట్టేది.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి దీనగాధ ఇది.చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు మృతి చెందడంతో.. తాత శిగ రాములు, నానమ్మ వెంకటమ్మలు చేరదీశారు.గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో 5 వరకు,పసునూరు ఆదర్శ పాఠశాల,కళాశాల లో 10 నుంచి ఇంటర్ వరకు చదివి అగ్రశ్రేణిలో నిలిచారు. చివరికి డాక్టర్ కావాలనే లక్ష్యంతో తొలి ప్రయత్నంగా నీట్ పరీక్షకు హాజరై దంత వైద్య కళాశాలలో సీటు పొందారు. కానీ లక్ష్యంలో మరో గురి.ఇది తనకు తగదని భావించింది గౌతమి. తనలాంటి పేదలందరికీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో డాక్టర్ కావాలని ముందుకు సాగింది. కానీ పేదరికం తన ప్రతాపాన్నంత చూపింది.అయినా దాన్ని లెక్కచేయకుండా తాత నానమ్మలతో కలిసి పత్తితోపాటు.. ఇతరుల పొలల్లో రోజువారి కూలి పనులకు వెళ్ళింది. వచ్చిన కూలి డబ్బును వెనకేసుకుంది. నానమ్మ తన పుస్తెలతాడును తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులతో హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంది.రేయింబవళ్లు కష్టపడి చదువుతూ.. మళ్లీ నీట్ పరీక్షకు హాజరైంది.ఈ మేరకు 507 మార్కులు పొంది మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. కష్టానికి ఫలితం దక్కినట్లుగా అందరూ సంతోషపడ్డప్పటికీ చదువు కోసం వెళదామంటే ఆర్థిక సమస్యలు గుదిబండల మారాయి.పుస్తకాలు,దుస్తులు,ఫీజులకు డబ్బులు లేక ఎప్పటిలాగే తాత,నానమ్మలతో కలిసి కూలి పనులకు వెళుతోంది.ప్రతి ఏటా రూ.ఒక లక్ష 50 వేలు ఉంటేనే ఆమె చదువుకోగలుగుతుంది.వీటి కోసం దాతలను ఆమె అభ్యర్థిస్తోంది. తన లక్ష్యానికి ఆర్థిక సహాయాలు అందించండి అంటూ వేడుకుంటుంది గౌతమి.