- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిన్నంటిన రోదనలు.. భారీగా మోహరించిన పోలీసులు
దిశ, జిన్నారం: జిన్నారం మండలంలోని ఖాజీపల్లి గ్రామ శివారులో గల నారాయణ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి వైష్ణవి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం విద్యార్థి బాల బోయిన వైష్ణవి (16) మృతుని నిరసిస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ముందు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. మృతురాలి బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నారాయణ కళాశాల యాజమాన్యం విద్యార్థుల పై తీవ్రమైన ఒత్తిడిని కలిగించడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని విద్యాబోధన చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల మీద ఉన్న ప్రేమ విద్యార్థులపై యాజమాన్యానికి లేదని ఆరోపించారు. మృతి చెందిన విద్యార్థిని వైష్ణవి కుటుంబాన్ని కళాశాల యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి సంఘాల నాయకులతో పాటు మృతురాలి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కళాశాలకు చేరుకొని కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పే లా ఉండడంతో భారీగా పోలీసులు కళాశాల వద్దకు చేరుకున్నారు. సీఐ గంగాధర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలకు చెందిన పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తును కళాశాల ముందు ఏర్పాటు చేశారు. జిన్నారం తహసీల్దార్ బిక్షపతి విద్యార్థి మృతికి గల కారణాలను తెలుసుకొని, జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారు. మృతురాలి తండ్రి పరశురాం ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పజెప్పామని సీఐ గంగాధర్ తెలిపారు.