రామ్ చరణ్ నటించిన ఈ సినిమా అంటే సురేఖకు అస్సలు నచ్చదట.. ఓరేయ్ నీవు ఇలాంటి మూవీస్ లైఫ్‌లో తీయొద్దంటూ!

by Anjali |
రామ్ చరణ్ నటించిన ఈ సినిమా అంటే సురేఖకు అస్సలు నచ్చదట.. ఓరేయ్ నీవు ఇలాంటి మూవీస్ లైఫ్‌లో తీయొద్దంటూ!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో, సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న.. తర్వాత ఆర్ఆర్ఆర్, ధృవ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే తాజాగా చరణ్ తల్లి సురేఖకు చెర్రీ నటించిన ఓ సినిమా అంటే అస్సలు నచ్చదంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.

మరీ ఆ సినిమా ఏమై ఉంటుందని అనుకుంటున్నారా? చరణ్ పోలీసు ఆఫీసర్‌గా నటించిన తుఫాన్ సినిమా. రామ్ చరణ్ పోలీస్ అధికారి పాత్రలో బాగా చేసినప్పటికీ.. ఆ స్టోరీ గానీ, చరణ్ క్యారెక్టరైజేషన్ గానీ సరిగ్గా లేవనీ ఓరేయ్ నువ్వు ఇలాంటి సినిమాలు ఫ్యూచర్ లో అస్సలు చేయకురా అంటుందట. అమితబచ్చాన్ హీరోగా వచ్చిన జంజీర్ చిత్రానికి రీమేక్ గా తుఫాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ మూవీని విడుదల చేయగా.. బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. ఈ చిత్రం రెండు చోట్ల(తెలుగు, హిందీ) రిలీజైనప్పటికీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed