- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hollywood Stars : ట్రంప్ ఎంట్రీ.. హాలీవుడ్ స్టార్స్ ఎగ్జిట్!
దిశ, నేషనల్ బ్యూరో : అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. అమెరికా(US) అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అన్ని రకాల సాయం చేశాడు. ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కట్ చేస్తే.. ఎన్నికల్లో ట్రంప్ గెలిచాక, ఎలాన్ మస్క్ కుమార్తె, 20 ఏళ్ల వివియన్ జెన్నా విల్సన్ సంచలన ప్రకటన చేసింది. ట్రంప్ గెలిచారు కాబట్టి.. అమెరికాలో ఇక తనలాంటి ట్రాన్స్ జెండర్లకు భవిష్యత్తు లేదని ఆమె పేర్కొంది. ఈ ఎన్నికల ఫలితం చూశాక, దేశం విడిచి వెళ్లిపోవాలనే భావన తనలో బలపడిందని వెల్లడించింది. అమెరికాలోని చాలామంది హై ప్రొఫైల్ హాలీవుడ్ సెలిబ్రిటీలు(Hollywood Stars) కూడా ఇప్పుడు ఇదే విషయాన్ని చెబుతున్నారు. యూఎస్ వదిలి వెళ్లిపోతామని అంటున్నారు.
యూఎస్ నుంచి వెళ్లిపోనున్న నటీమణులు వీరే..
* ప్రముఖ హాలీవుడ్ నటి 40 ఏళ్ల అమెరికా ఫెరీరా తాను యూకేకు వెళ్లిపోతానని తెలిపారు. తన ఇద్దరు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం యూఎస్ నుంచి వెళ్లక తప్పేలా లేదన్నారు. కమలా హ్యారిస్ ఓటమిపై ఆమె తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు.
* తాను ఇటలీకి వెళ్లిపోవాలని భావిస్తున్నానని ప్రముఖ నటి షెరాన్ స్టోన్(Sharon Stone) తెలిపారు. ద్వేషం, అసహనం అనే దుర్మార్గపు పునాదులపై నిలబడి అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలిచారని ఆమె విమర్శించారు.
* తాను అమెరికా వీడటం ఖాయమని ప్రముఖ హాలీవుడ్ సింగర్, నటి చెర్(Cher) తెలిపారు. ట్రంప్ ఎన్నికల్లో గెలవడాన్ని చూసి తన ఆరోగ్యం దెబ్బతిందని ఆమె ఆరోపించారు. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు తనకు అల్సర్ వచ్చిందంటూ చెర్ వ్యంగ్య కామెంట్ చేశారు.
* ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ డ్రామాలో కీలక పాత్ర పోషించిన బ్రిటీష్ నటి సోఫీ టర్నర్ ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ గెలుపుతో.. తిరిగి తన స్వదేశం యూకేకు వెళ్లిపోవాలనే ఆలోచనను ఆమె మొదలుపెట్టారు.
* ట్రంప్ గెలవడానికి చాలా నెలల ముందే.. బ్రిటీష్ నటి 54 ఏళ్ల మిన్నీ డ్రైవెర్ అమెరికా నుంచి యూకేకు వలస వెళ్లిపోయారు. అయితే వలస వెళ్లడానికి ముందు ఆమె మాట్లాడుతూ.. ‘‘ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి’’ అని తెలిపారు. దాదాపు 30 ఏళ్ల పాటు లాస్ ఏంజెలెస్‌లో నివసించిన మిన్నీ డ్రైవెర్ అకస్మాత్తుగా యూఎస్ నుంచి వెళ్లిపోవడం గమనార్హం.